ఇన్ స్టాగ్రామ్ ట్రెండింగ్ లో బ్రహ్మముడి సీరియల్ అప్పు!
on Jul 7, 2023
నైనిషా రాయ్.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ప్రేక్షకులకు ' 'అప్పు' అంటే సుపరిచితమే. అప్పు పాత్రలో నైనిషా రాయ్ నటిస్తూ అందరికి ఆకట్టుకుంటుంది. రాజ్ తమ్ముడు కళ్యాణ్ కి మంచి ఫ్రెండ్ లా నటిస్తుంది. 'బ్రహ్మముడి' సీరియల్ లో అప్పుగా కనకం-కృష్ణమూర్తిలకి కూతురిగా నటిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి భారం కాకూడదని అప్పు.. తను సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ చదువుకుంటుంది. ఈ సీరియల్ లో అప్పు.. లేడీ రౌడీలా అదరగొడుతుంది.
నైనిషా రాయ్.. తెలుగు సీరియల్ నటి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్ తో ఫేమ్ లోకి వచ్చిన నైనిషా అనేక సీరియల్స్ లో చేసింది. సీరియల్స్ తో పాటు పలు సినిమాలలో కూడా నైనిషా రాయ్ నటించింది. 'కథానిక', 'సూర్య' వంటి సినిమాలలో నటించింది నైనిషా. పశ్చిమ బెంగాల్ లో పుట్టిన నైనిషా.. అక్కడ కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత తను లా కోర్స్ చదివింది. అయితే తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో తెలుగులో పలు సీరియల్స్ లో నటించింది. జెమినిలో ప్రసారమైన 'భాగ్యరేఖ' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది నైనిష. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన 'శ్రీమంతుడు' సీరియల్ లో కార్తీక పాత్రలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బంధం సీరియల్ లో నటించింది నైనిషా రాయ్.
నైనిషా రాయ్.. ఇన్ స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. కాగా తనకి ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. తన పేరు మీద చాలా ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. బ్రహ్మముడి లో కళ్యాణ్ పాత్రలో చేస్తున్న కిరణ్ కాంత్ తో కలిసి కొన్ని రీల్స్ చేయగా అవి వైరల్ గా మారాయి. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ' హీ సేస్ ఇట్ ఈజ్ ఆన్ ఐ ఫీస్ట్ టు ఏ డర్టీ మైండ్' అని క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో పోస్ట్ చేసింది నైనిషా రాయ్. ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్స్ లోని నటులలో.. బ్రహ్మముడి సీరియల్ లోని ఎవరో ఒకరు ట్రెండింగ్ లో ఉంటూ వస్తున్నారు.